ప్రగతి పథంలో దూసుకుపోతున్న మహేష్ బాబు దత్తత గ్రామం

ప్రగతి పథంలో దూసుకుపోతున్న మహేష్ బాబు దత్తత గ్రామం

సూపర్‌స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్‌ ప్రగతి పథంలో దూసుకువెళుతోంది. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దత్తతకు ముందు ఎవ్వరికీ తెలియని ఈ గ్రామం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితమైంది. మహేష్ బాబుకు చెందిన ప్రతినిధులు ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మహేష్ బాబు 2015 సెప్టెంబర్‌ 28న సిద్ధాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

ప్రస్తుతం గ్రామశివారులో రూ. 1.50 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో అన్ని వసతులు, సౌకర్యాలతో నిర్మిస్తున్న పాఠశాల భవనం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.సిద్ధాపూర్‌ గ్రామం జాతీయ రహదారికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.సుమారు 1.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో ట్రస్ట్‌ నిర్మిస్తున్న పాఠశాల భవనం గ్రామానికే ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది అని ఆమె తెలిపారు

గ్రామ సమీపంలో సుమారు రూ. కోటి 50 లక్షలతో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పాఠశాల భవనాన్ని అత్యాధునిక సాంకేతికతో నిర్మిస్తున్నారు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు.ఇప్పటికే గ్రామంలో రూ.20 లక్షలతో ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని నిర్మించారు. గ్రామంలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు వీలుగా రూ.10.80 లక్షలు వెచ్చించి ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించారు.