యువతి ప్రాణం తీసిన ఏఐఏడీఎంకే లీడర్ హోర్డింగ్

యువతి ప్రాణం తీసిన ఏఐఏడీఎంకే లీడర్ హోర్డింగ్

ఇటీవలి కాలంలో బ్యానర్ల(హోర్డింగ్స్) సంస్కృతి బాగా పెరిగిపోయింది. రాజకీయ పార్టీలతోపాటు ఏ కార్యక్రమం జరిగినా జనాలు బ్యానర్లు కట్టడం పరిపాటిగా మారిపోయింది. అయితే, కొన్నిసార్లు తగిన జాగ్రత్త చర్యలు పాటించకుండా కట్టిన బ్యానర్లతో జనాలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. తాజాగా, ఇలాంటి ఘటనే తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది.

చెన్నైలో వాటర్ ట్యాంకర్ తనపై నుంచి దూసుకెళ్లడంతో ఓ 23ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. అధికార పార్టీ అయిన ఏఐఏడీఎంకేకు చెందిన బ్యానర్ ఆమెపై పడటంతో ఒక్కసారిగా ఆమె కూడా రోడ్డుపై పడింది. అటుగా వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లడంతో మృతి చెందింది.

పరీక్ష రాసి వస్తుండగా.. మృతురాలిని శుభశ్రీ(23)గా గుర్తించారు. గురువారంనాడు ఆమె పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న సమయంలో దక్షిణ చెన్నైలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో అధికారంలో ఉన్న ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెట్రా ఖజగమ్(ఏఐఏడీఎంకే) పార్టీ బ్యానర్‌ను ఆ పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ కట్టాడు.