ధోని పై చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అబిప్రాయం

ధోని పై చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అబిప్రాయం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌లో చాలా సాధించాడని, ఇక అతను సాధించాల్సినవేమీ లేవని చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు. ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసని, అతనికి ఎవరూ సలహాలు ఇవ్వనవసరం లేదని తెలిపారు. ధోనీ రిటైర్మెంట్‌పై ప్రస్తుతం మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్ స్పందించాడు.
సరైన సమయంలో సరైన తీసుకోవాలని మహీకి తెలుసు. భారత్‌కు ధోనీ రెండు ప్రపంచకప్‌లు అందించాడు. అతని సారథ్యంలో భారత్ అన్ని ఫార్మాట్లలోనూ చాలా మెరుగుపడింది. అతడు స్ఫూర్తినిచ్చే నాయకుడు. క్రికెట్‌లో అతను సాధించాల్సినవి ఇంకేమీ లేవు. క్రికెట్ నుంచి ఎప్పుడు నిష్క్రమించాలో అతడికి ఎవరూ చెప్పనక్కర్లేదు. ఏమి చేయాలో అతడికి బాగా తెలుసని ఆనంద్ పేర్కొన్నాడు.