నా సంగీతాన్ని వ‌ర్మ మ‌రో మెట్టు ఎక్కించారు

keeravani praises on rgv About GST Movie Music
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాస్ప‌ద రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన గాడ్ సెక్స్ ట్రూత్ ఎంత సంచ‌ల‌నంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. వివాదాల సంగ‌తి ప‌క్క‌న పెడితే జీఎస్టీ విష‌యంలో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం ఎం.ఎం. కీర‌వాణి దీనికి సంగీతం అందించ‌డం. టాలీవుడ్ లో కీర‌వాణి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. త‌న కెరీర్ లో ఆయ‌న ఎక్కువ‌గా కుటుంబ‌క‌థా చిత్రాల‌కే సంగీతం స‌మ‌కూర్చారు. ఎన్నో హిట్ చిత్రాల‌కు మ్యూజిక్ అందించారు. బాహుబ‌లి సినిమాల‌తో అంత‌ర్జాతీయ గుర్తింపు పొందారు. అలాంటి కీర‌వాణి ఓ పోర్న్ వీడియోకు ఎందుకు మ్యూజిక్ డైరెక్ష‌న్ చేశారో ఎవ‌రికీ అర్ధం కాలేదు. ప‌లువురు కీర‌వాణిపై విమ‌ర్శ‌లు గుప్పించారు కూడా. అయితే కీర‌వాణి మాత్రం వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు స‌రికదా…వ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

జీఎస్టీతో త‌న సంగీతాన్ని వ‌ర్మ మ‌రో మెట్టు ఎక్కించాడ‌ని పొగడ్త‌లు కురిపిస్తూ కీర‌వాణి ఓ ట్వీట్ చేశారు. సెల్యులాయిడ్ పై ప‌లు ర‌కాల భావాల‌ను ప‌లికించే ఆయ‌న తెలివితేట‌లు త‌న‌తో 1991లో రొమాన్స్ ను, 1992లో కామెడీని, 2018లో సెక్స్ ను ప‌లికించాయ‌ని కీర‌వాణి త‌న ట్వీట్ లో చెప్పుకొచ్చారు. ఇక ఈ సంవ‌త్స‌రంలో ఆయ‌న తీయ‌నున్న హార‌ర్, వ‌యొలెన్స్ చిత్రాల‌కు సంగీతం అందించ‌బోతున్నాన‌ని తెలిపారు. త‌న‌ను న‌మ్మిన పిచ్చి ద‌ర్శ‌కుడికి కృత‌జ్ఞ‌త‌లు అని ట్వీట్ చేశారు. కీర‌వాణి ట్వీట్ చూసిన వ‌ర్మ థాంక్యూ కీరూ అని రీట్వీట్ చేశారు.

keeravani about rgv