మెగా వార్‌ తప్పిందా?

tholi prema movie release Date postponed
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా హీరోలు మొదటి సారి బాక్సాఫీస్‌ ముందుకు ఒకే రోజున రాబోతున్నారు. వరుణ్‌ తేజ్‌ ‘తొలిప్రేమ’ మరియు సాయి ధరమ్‌ తేజ్‌ ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాల విడుదల తేదీలపై ఆయా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారిక ప్రకటనలు కూడా చేశారు. మొదటి సారి మెగా ఫ్యామిలీ హీరోలు ఢీ కొట్టబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఫిబ్రవరి 9పై కేంద్రీకృతం అయ్యి ఉంది. మెగా హీరోల్లో ఎవరు పై చేయి సాధిస్తారు అంటూ మెగా ఫ్యాన్స్‌ చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలోనే వరుణ్‌ తేజ్‌ నటించిన ‘తొలిప్రేమ’ విడుదల వాయిదా పడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇంటిలిజెంట్‌ సినిమాకు భారీ క్రేజ్‌ ఉన్న నేపథ్యంలో ఆ చిత్రంతో పెట్టుకోవడం వల్ల నష్టం అని భావించి ఈ నిర్ణయంకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.

పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ మూవీ టైటిల్‌తో వరుణ్‌ తేజ్‌ వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో వరుణ్‌ తేజ్‌ ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం విడుదల వాయిదా వార్తలు నిజం కాదంటూ అనధికారికంగా చెప్పుకొచ్చారు. సినిమా విడుదల వాయిదా పడకుంటే అధికారికంగా ప్రెస్‌ నోట్‌ విడుదల చేయవచ్చు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్‌ సలహా మేరకు ఈ రెండు సినిమాల తేదీల్లో మార్పులు చేశారంటూ విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. మొదట సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘ఇంటిలిజెంట్‌’ను విడుదల చేసి ఆ తర్వాత ‘తొలిప్రేమ’ను విడుదల చేయాలని మెగా ఫ్యామిలీ నుండి నిర్మాతలకు ఆదేశం వెళ్లిందని అందుకే తొలిప్రేమ ప్రమోషన్‌ జోరు తగ్గించారు అంటూ సమాచారం అందుతుంది.