‘మహానటి’లో సమంత ఏంటో తేలిపోయింది

keerthi suresh says samantha akkineni role in mahanati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత మూడు సంవత్సరాలుగా ‘మహానటి’ చిత్రం గురించి తెలుగు ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సుదీర్ఘంగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరిపిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కొన్ని నెలల క్రితం సినిమాను పట్టాలెక్కించాడు. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేసిన దర్శకుడు సమంతను కూడా ఈ చిత్రంలో నటింపజేయడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కీర్తి సురేష్‌ పాత్ర సరే సమంత చేయబోతున్న పాత్ర ఏంటీ, ఆమె కనిపించబోతున్న పాత్ర ఎలా ఉంటుందని సినీ వర్గాల్లో ఆసక్తి వ్యక్తం అవుతుంది. మొదట సమంత సీనియర్‌ హీరోయిన్‌ జమున పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

Keerthi-Suresh-Says

ఆ తర్వాత సమంత ఒక జర్నలిస్ట్‌ పాత్రను పోషిస్తుందని, సావిత్రి జీవిత చరిత్ర గురించి ఆమె ప్రేక్షకులకు వివరిస్తూ ఉంటుందని, సినిమా మొత్తం కూడా సమంత పాత్ర ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సమంత పాత్రపై హీరోయిన్‌ కీర్తి సురేష్‌ నోరు జారింది. కీర్తి సురేష్‌ తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహానటి చిత్రం గురించి కూడా స్పందించింది. సావిత్రి జీవిత చరిత్ర సినిమాలో నటించడం ఆనందంగా ఉందని కీర్తి సురేష్‌, జమును పాత్రను సమంత చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. సావిత్రికి జమునకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే పేరు ఉండేది. అందుకే ఈ చిత్రంలో జమున పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ కారణంగా సమంత జమున పాత్రను చేసేందుకు కమిట్‌ అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే సమ్మర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.