మహానటి, మాస్‌రాజా కాంబో..!

keerthi suresh to act in raviteja next movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ తెలుగులో కూడా వరుసగా చిత్రాల్లో నటిస్తూ దూసుకు పోతుంది. సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈ అమ్మడు వరుసగా చిత్రాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈమె నటించిన ‘మహానటి’ చిత్రం విడుదలకు ముస్తాభవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన మహానటి చిత్రంతో కీర్తి సురేష్‌ స్థాయి మరింత పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక తాజాగా ఈ అమ్మడు మాస్‌ మహారాజా రవితేజ నటించబోతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.

ప్రస్తుతం ‘నేల టికెట్‌’ చిత్రాన్ని చేస్తున్న రవితేజ ఆ వెంటనే శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. పవన్‌ కళ్యాణ్‌తో సంతోష్‌ శ్రీనివాస్‌ ఒక చిత్రాన్ని చేయాలని భావించాడు. అయితే పవన్‌ రాజకీయాలతో బిజీగా అవ్వడం వల్ల సినిమా చేయలేక పోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దాంతో ఆ సినిమాను రవితేజతో తెరకెక్కించేందుకు దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేయడం జరిగింది.