శ్రీరెడ్డి వ్యాఖ్యలపై నాని రెస్పాన్స్‌..!

Natural Star Nani Responds Sri Reddy Comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న విమర్శలు తారా స్థాయికి చేరాయి. తాజాగా నేచురల్‌ స్టార్‌ అంటూ నానిని టార్గెట్‌ చేసింది. నానిపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. అంతకు ముందు శేఖర్‌ కమ్ముల గురించి నోటికి వచ్చినట్లుగా శ్రీరెడ్డి మాట్లాడటం జరిగింది. ఆయన పోలీస్‌ కేసు పెడతాను, క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ హెచ్చరించడంతో శ్రీరెడ్డి అయ్యో మీ గురించి కాదంటూ తప్పించుకుంది. తాజాగా నానిపై చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తుందనే ఉద్దేశ్యంతో నాని అండ్‌ కో రెస్పాండ్‌ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు.

నాని వద్దకు శ్రీరెడ్డి వ్యాఖ్యలు వెళ్లాయని, అయితే నాని మాత్రం పెద్దగా రెస్పాండ్‌ అవ్వలేదని తెలుస్తోంది. తన గురించి అందరికి తెలుసని, ఆమె చేసిన వ్యాఖ్యలను మీడియా వారు, అభిమానులు పట్టించుకోరని చెప్పుకొచ్చాడు. మీడియాలో ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తే ఆమెకు పబ్లిసిటీ చేసినట్లుగా అవుతుందని నాని భావించాడు. అందుకే నాని పీఆర్‌ టీం కూడా ఈ విషయంపై పెద్దగా స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆమె చేసిన వ్యాఖ్యలు కొద్ది మందికే తెలుసు, అదే నాని రెస్పాండ్‌ అయితే మొత్తం అందరికి తెలుస్తుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం ఎంత అనే విషయం తెలియకుండానే టాపిక్‌ కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.