పైకి ఎన్.టి. రామారావు లోపల సుబ్బారావు…

kethireddy jagadishwar reddy focus on Subbarao for Lakshmi's Veeragrandham

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్ జీవిత చరిత్ర కేంద్రబిందువుగా ఇప్పటికే మూడు సినిమాలు మొదలయ్యాయి. బాలయ్య, తేజ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి “ఎన్టీఆర్ “ నే టైటిల్ గా అనుకుంటున్నారు. ఇక వర్మ తీస్తున్న సినిమాకి “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ అన్న టైటిల్ ముందుగానే అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమాకి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకుడిగా వస్తున్న ఇంకో సినిమా “లక్ష్మీస్ వీరగ్రంధం “. ఈ సినిమా కధకి సంబంధించి లక్ష్మీపార్వతి ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మీద అభిమానంతో. ప్రేమతో ఈ సినిమా తీస్తున్నట్టు చెప్పుకుంటున్న కేతిరెడ్డి లక్ష్మీస్ వీరగ్రంధం సబ్జెక్టు మీద వర్క్ చేయడానికి ఇప్పటిదాకా ఎన్నో ప్రాంతాలు తిరిగారు. వాటితో ఎన్టీఆర్ కి అంతంత మాత్రపు సంబంధమే వుంది. అవన్నీ లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం సుబ్బారావు జీవితంతో ముడిపడివున్న ప్రాంతాలే.

Lakshmi's Veeragrandham Movie

పైకి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నప్పటికీ “లక్ష్మీస్ వీరగ్రంధం “ సినిమాలో కధంతా లక్ష్మీపార్వతి, వీరగంధం సుబ్బారావు ల పెళ్లి, అంతకుముందు వారి జీవితం, పెళ్లి తర్వాత తలెత్తిన ఇబ్బందులు, లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ పరిచయం తదితర అంశాల మీద ఈ సినిమాలో ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. వీరగంధం సుబ్బారావు కి హరికధకుడిగా వున్న పేరు , ఆ విద్యతో ఆయన సంపాదించుకున్న కీర్తిప్రతిష్టలు మొదలైన విషయాల మీద కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్పెషల్ గా దృష్టి సారించారు.” లక్ష్మీస్ వీరగ్రంధం “సినిమాలో సుబ్బారావు క్యారెక్టర్ హైలైట్ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి విడుదల అయిన ఓ పోస్టర్ కూడా దాదాపు ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. సుబ్బారావు పాత్ర హైలైట్ అయ్యేకొద్దీ తన పాత్ర ని తక్కువ చేసి చూపుతారేమో అన్న భయం లక్ష్మీపార్వతిని వెన్నాడుతోంది. అందుకే ఆమె ఈ సినిమాని అడ్డుకోడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కానీ కేతిరెడ్డి ఆమె మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. లక్ష్మీపార్వతితో కయ్యానికి సై అంటూ కాలు దువ్వుతున్నారు.