అన్నగారు ఎన్టీఆర్‌ ఆయన కలలోకి కూడా వచ్చారా?

kethireddy Jagadishwar reddy says NTR comes into my dream

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని త్వరలో సెట్స్‌పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాలో పాత్రలకు నటీనటుల ఎంపిక జరిగింది. త్వరలోనే ఎన్టీఆర్‌ పాత్రకు ఎవరిని ఎంపిక చేయడం జరిగిందో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక స్క్రిప్ట్‌ వర్క్‌లో తనకు ఎన్టీఆర్‌ కలలోకి వచ్చి సలహాలు సూచనలు ఇస్తూ తన జీవిత చరిత్ర చెబుతూ సాయం చేశాడు అంటూ వర్మ ఆ మద్య చెప్పుకొచ్చాడు. ప్రతి రోజు ఎన్టీఆర్‌ కలలోకి వచ్చి నా పనిని తేలిక చేశాడు అని, స్క్రిప్ట్‌ బాగా వచ్చిందని, చిరిగిన పేజీలను చరిత్ర పుస్తకంలో అంటించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నాను అని, ఎన్టీఆర్‌ కూడా నా కలలో అదే చెప్పాడు అంటూ వర్మ పేర్కొనడం జరిగింది.

ఎన్టీఆర్‌ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంలో తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడును టార్గెట్‌ చేస్తూ కొన్ని సీన్‌లు ఉండబోతున్నాయి. ఇప్పటికే ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. అందుకే తెలుగు దేశం పార్టీకి చెందిన వారు కూడా ఆ సినిమాకు కౌంటర్‌గా లక్ష్మీపార్వతిని టార్గెట్‌ చేస్తూ ఒక సినిమాను తీసేందుకు సిద్దం అయ్యాడు. తమిళనాడులో తెలుగు సంఘం అధ్యక్షుడు అయిన కేతిరెడ్డి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుపుతున్నాడు.

ఇటీవలే లక్ష్మీ పార్వతి మొదటి భర్త అయిన వీరగ్రంధం సొంత ఊరుకు వెళ్లి అక్కడ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. లక్ష్మీ పార్వతి మొదటి పెళ్లి, ఆ తర్వాత హార్మోనియం కళాకారిణిగా ఎలా అయ్యింది, ఎన్టీఆర్‌ను ఎలా బుట్టలో వేసుకుంది అనే విషయాలను కేతిరెడ్డి చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్‌లో కూడా కేతిరెడ్డికి ఎన్టీఆర్‌ సాయం చేస్తున్నాడట. ఎన్టీఆర్‌ ఈయనకు కూడా కలలోకి వచ్చి తన జీవిత చరిత్రలోని కొన్ని జరిగిన తప్పులను చెబుతున్నాడట. కేతిరెడ్డి ఆ విషయాలను నోట్‌ చేసుకుని ఉన్నది ఉన్నట్లుగా తీస్తాను అంటూ చెబుతున్నాడు. కేతిరెడ్డి జగదీష్‌ రెడ్డి తీయబోతున్న ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ చిత్రంపై లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తన అనుమతి లేకుండా తన గురించి సినిమాలో ఏమైనా చూపిస్తే ఖచ్చితంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ తాజాగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మౌన దీక్ష చేసిన విషయం తెల్సిందే.