‘కేజిఎఫ్’ ట్రైలర్ : ఈ ప్రపంచాన్నే గెలుస్తావు

KGF Movie Trailer

ఈ మధ్య కాలంలో కలిగిన కథల ద్వారా తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకులు. అలా విభిన్నమైన కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘కేజిఎఫ్’ సినిమా రెడీ అవుతోంది. యష్, శ్రీనిధి శెట్టి నాయకా నాయికలుగా నటించిన ఈ కన్నడ సినిమాలో, రమ్యకృష్ణ నాజర్ లు కీలకమైన పాత్రలను పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ముంబైతో ముడిపడిన గోల్డ్ మైన్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది.

kgf-movie

ఆసక్తికరమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. “నీ వెన్నంటి వేలమంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ఈ ప్రపంచాన్నే గెలుస్తావు”అనే డైలాగ్ అంచనాలను మరింత పెంచుతోంది. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.