అక్కినేని కింగ్ నాగార్జున తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘కింగ్ 100’ King 100 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తుండటం ఆసక్తిని పెంచుతోంది.
టబు ఎంట్రీతో గ్లింప్స్‌లో హై వోల్టేజ్!
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నాగార్జున సినిమాతో టబు మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో నాగ్‌తో రొమాంటిక్ పాత్రల్లో కనిపించిన ఆమె, ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ ఆమెను ‘మహంతి జాన్సీ రాణి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో పరిచయం చేసినట్లు సమాచారం.
“హార్డ్ వర్క్, లక్‌ను నమ్మే రెండు రకాల మనుషులు ఉంటారు. కానీ నేను లక్‌ను నమ్మను” అనే డైలాగ్‌తో టబు పాత్రకు అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారట. దీంతో గ్లింప్స్‌లో ఆమె ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు టాక్ వినిపిస్తోంది.
నాగ్ – టబు మధ్య గట్టి వార్!
ఈ సినిమాలో నాగార్జున, టబు మధ్య ఆసక్తికరమైన సంఘర్షణ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి మధ్య కనిపించిన రొమాంటిక్ కెమిస్ట్రీకి భిన్నంగా, ఈసారి ఇద్దరి పాత్రల మధ్య పవర్‌ఫుల్ డ్రామా ఉండనుందని తెలుస్తోంది.
డీఎస్పీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్!
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న గ్లింప్స్ టాక్ ప్రకారం, ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉందట. టబు ఎంట్రీకి ఇచ్చిన మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి నాగార్జున 100వ సినిమా కావడంతో పాటు, నాగ్ – టబు కాంబినేషన్ మరోసారి తెరపైకి వస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.




