కిర్రాక్ పార్టీ రివ్యూ….. తెలుగు బులెట్

Kirrak Party movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  నిఖిల్‌, సిమ్రాన్ ప‌రింజ‌, సంయుక్తా హెగ్డే
నిర్మాత:     రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం :   శరణ్ కొప్పిశెట్టి
సినిమాటోగ్రఫీ:   అద్వైత గుర్తుమూర్తి
ఎడిటర్ :    ఎం.ఆర్‌.వ‌ర్మ‌
మ్యూజిక్ :  అజ‌నీశ్ లోక్‌నాథ్

కన్నడం లో సూపర్ డూపర్ హిట్ అయిన “ కిర్రాక్ పార్టీ “ ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఒక్కో సినిమాని ఆచితూచి ఎంపిక చేసుకుంటున్న యువ హీరో నిఖిల్ ఈ రీమేక్ కి ఎస్ చెప్పడంతో కిర్రాక్ పార్టీ మీద అంచనాలు పెరిగాయి. నేడు విడుదల అయిన కిర్రాక్ పార్టీ ఆ అంచనాలు అందుకుందో ,లేదో చూద్దాం.

కథ…

కృష్ణ ( నిఖిల్ ) ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి. అయితే కాలేజీలో చేరాక ఫైనల్ ఇయర్ చదువుతున్న మీరా (సిమ్రాన్ పరీన్జా) ప్రేమలో పడతాడు. పోలీస్ అధికారి కుమార్తె అయిన మీరా కూడా కృష్ణతో స్నేహంగా ఉంటుంది. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా హాస్టల్ రూమ్ కిటికీ నుంచి కింద పడి చనిపోతుంది. దీనికి కారణం ఏంటి ? ఈ ఘటన తరువాత కృష్ణ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ…

కన్నడంలో హిట్ అయిన కిర్రాక్ పార్టీ సినిమా కధలో పెద్దగా మార్పులు లేకుండానే దర్శకుడు శరన్ కొప్పిశెట్టి ముందుకు వచ్చారు. చేసిన ఒకటిరెండు మార్పులు కూడా కధాగమనానికి ఏ మాత్రం ఇబ్బంది కలిగించేవి కాదు. స్క్రీన్ ప్లే లో చేసిన మార్పులు కిర్రాక్ పార్టీ కి ఇంకా బలం చేకూర్చింది. పైకి ఇది ఓ లవ్ స్టోరీ అనిపించినా రొమాన్స్ , కామెడీ , యాక్షన్, సెంటిమెంట్ , మెసేజ్ వంటివి కలగలిసిన కథ. ఇలాంటి కధని ఓ కొత్త దర్శకుడు ఎలా డీల్ చేస్తాడో అనుకున్నప్పటికీ శరన్ కొప్పిశెట్టి చేయి తిరిగిన దర్శకుడిలా కధని నడిపించాడు. కధలో మలుపులు , ఎమోషన్స్ ని బాగా పండించాడు.

నిఖిల్ చేసిన పాత్ర హ్యాపీ డేస్ కి కొనసాగింపు అనిపిస్తుంది. అయితే కధాగమనంలో నిఖిల్ పాత్ర మారిన తీరు , ఆయన నటన సినిమాకు ప్లస్ గా నిలిచింది. హీరోయిన్లు సిమ్రాన్ , సంయుక్త హెగ్డే తో పాటు కన్నడ వెర్షన్ తో పాటు ఇప్పుడు తెలుగులో చేసిన నటులు బాగా చేశారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా బాగుంది.

ప్లస్ పాయింట్స్ …
కథ
మలుపులు
నిఖిల్
హీరోయిన్లు

మైనస్ పాయింట్స్ ..
అక్కడక్కడా రొటీన్ సీన్స్

తెలుగు బులెట్ పంచ్ లైన్ … “కిర్రాక్ పార్టీ “ పేరుకు తగ్గట్టే ….
తెలుగు బులెట్ రేటింగ్ … 3 /5 .