సరికొత్త ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన కోహ్లీ

kohli created thenew world record

వరుస రికార్డులతో దూసుకుపోతూన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో భారీ రికార్డు క్రియేట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన క్లబ్‌లో చోటు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 20 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ రికార్డ్ క్రియేట్ చేశాడు. వెస్టిండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌‌లో 37 పరుగులు పూర్తి చేయగానే కోహ్లి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ సచిన్, లారా పేరిట ఉండేది. వీరిద్దరూ 453 ఇన్నింగ్స్‌ల్లో 20 వేల పరుగుల మార్క్‌ను చేరుకోగా.. కోహ్లి కేవలం 417 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. రిక్కీ పాంటింగ్ 468 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. మొన్న అఫ్గానిస్తాన్‌ తో మ్యాచ్‌ లోనే కోహ్లి ఆ రికార్డును క్రియేట్ చేస్తాడని అనుకున్నారు కానీ అప్పుడు టైం కలిసి రాక ఈరోజు ఆ రికార్డు క్రియేట్ చేశాడు. కాగా, కోహ్లి ఇప్పటివరకూ ఆడిన అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపినా 416. దాంతో వరల్డ్‌కప్‌లోనే ఆ రికార్డును కోహ్లి క్రియేట్ చేశాడు.