మెగా ‘జవాన్‌’లో దిల్‌రాజు, కొరటాల వేళ్లు?

koratala shiva corrections for jawan movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రచయిత బివిఎస్‌ రవి దర్శకత్వంలో ‘వాంటెడ్‌’ అనే చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా ఫలితంతో దర్శకుడిగా రెండవ సినిమా చేసేందుకు రవి చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఇన్నాళ్లకు మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఈయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. తేజూ, రవిల కాంబినేషన్‌లో ‘జవాన్‌’ చిత్రం తెరకెక్కింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. పలు సార్లు రీ షూట్‌లు జరపడంతో పాటు, వాయిదాలు వేయడం వల్ల సినిమాపై ఆసక్తిని ప్రేక్షకులు కోల్పోయారు. ఇప్పటికే దిల్‌రాజు ‘జవాన్‌’ చిత్రంలోని పలు సీన్స్‌కు రీ షూట్‌ చెప్పాడని, ఆ సీన్స్‌ను షూట్‌ చేయడం జరిగిందనే వార్తలు వస్తున్నాయి.

jawan

తాజాగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం ‘జవాన్‌’ చిత్రంకు సంబంధించి కొరటాల శివ కూడా కొన్ని సలహాలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు రవి మరియు కొరటాల శివలు కాస్త సన్నిహితులు. ఆ కారణంగానే జవాన్‌ చిత్రానికి కొరటాల కొన్ని కరెక్షన్స్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ కరెక్షన్స్‌ను చేయడంతో పాటు, స్క్రిప్ట్‌ను కూడా కొరటాల శివ సలహాల మేరకు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ‘జవాన్‌’ సినిమాలో దిల్‌రాజు, కొరటాల శివలు వేళ్లు పెట్టిన నేపథ్యంలో మంచి ఔట్‌ పుట్‌ వచ్చి ఉంటుందనే ఆసక్తి సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. మరో వారం రోజుల్లో ‘జవాన్‌’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.