మెహ్రీన్‌ కోరిక చాలా పెద్దదే…

mehreen pirzada want to do movie with tollywood Top Heros

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌ ప్రస్తుతం తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా దూసుకు పోతుంది. యువ హీరోలు ఈమె వెంట పరుగులు తీస్తున్నారు. లక్కీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు మంచి సక్సెస్‌ రేట్‌తో దూసుకు పోతుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తర్వాత అంత స్పీడ్‌గా స్టార్‌ హీరోలతో సినిమాలను చేసే అవకాశం ఈమెకు దక్కుతుందని సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఇటీవల ఈమె నటించిన ‘రాజా ది గ్రేట్‌’ మరియు మహానుభావుడు చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. త్వరలో జవాన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ అమ్మడు తన మనస్సులో ఉన్న కోర్కెను చెప్పి అందరికి షాక్‌ ఇచ్చింది.

mehreen-pirzada-next-movies

తనకు తెలుగులో ఇష్టమైన హీరోలు చాలా మంది ఉన్నారని, వారందరితో కలిసి నటించాలని కోరికగా ఉందని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌బాబులతో ఒక్కో సినిమా అయినా చేయాలనేది తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది. ఈ స్టార్‌ హీరోలందరితో కలిసి నటించే అవకాశం రావడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఇందులో ముగ్గురు లేదా నలుగురితో సినిమా చేసినా కూడా మెహ్రీన్‌ రేంజ్‌ పెరిగి పోవడం ఖాయం. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా మెహ్రీన్‌ మారిపోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మరి మెహ్రీన్‌కు అంత భారీ ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.