చిరు 152లో హీరోయిన్స్‌…!

Koratala Siva Heroines Selection For Chiranjeevi 152 Movie

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం విడుదలకు ముందే కొరటాల దర్శకత్వంలో మూవీ పట్టాలెక్కబోతుంది. భరత్‌ అనే నేను చిత్రం తో భారీ బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికను సిద్దం చేశాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ ముగింపుకు చేరుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో చిరంజీవి డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు అంటూ మెగా వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఈ సమయంలోనే ఈ చిత్రం కోసం హీరోయిన్స్‌గా తమన్నా మరియు నిత్యామీనన్‌లను ఎంపిక చేయాలని కొరటాల ఫిక్స్‌ అయ్యాడు.

cheranjeevi

చిరంజీవికి జోడీగా ప్రస్తుతం సైరా చిత్రంలో నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. తదుపరి చిత్రానికి మొదట శ్రియను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఈ చిత్రం కోసం తమన్నా మరియు నిత్యామీనన్‌లు అయితే బాగుంటుందని కొరటాల శివ భావిస్తున్నాడు అని, త్వరలోనే హీరోయిన్స్‌ ఎంపిక విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చరణ్‌తో గతంలో రొమాన్స్‌ చేసిన కాజల్‌తో ఖైదీలో రొమాన్స్‌ చేసిన చిరంజీవి ఇప్పుడు రచ్చ బ్యూటీ తమన్నాతో రొమాన్స్‌కు సిద్దం అవ్వడం చర్చనీయాంశం అవుతుంది. కూతురు వయస్సున్న హీరోయిన్‌తో చిరు కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక నిత్యామీనన్‌ సెకండ్‌ హీరోయిన్‌గా ఈ చిత్రంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు కొరటాల శివ ఉబలాట పడుతున్నాడు.

koratala-shiva