మగాడేగా అయితే నో ఫికర్ !

Korean Reporter Kissed by Russian Girls

రష్యాలో జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ పోటీల లైవ్ రిపోర్టింగ్ లో ముద్దుల వర్షం కురిపించిన ఘటనలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ మహిళా రిపోర్టరు లైవ్ లో మాట్లాడుతుండగా ఇంతలో పక్కనుంచి వచ్చిన ఓ యువకుడు ఆమెకు ముద్దిచ్చి పారిపోయాడు. ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు ఒక మగ రిపోర్టరు స్టేడియం నుంచి లైవ్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ల వివరాలు చెపుతుండగా అంతలో ఇద్దరు అందాల భామలు ఒకరి తర్వాత మరొకరు వచ్చి అతన్ని ముద్దాడారు. ఒకసారి తమాయించుకున్న రిపోర్టరు రెండోసారి అమ్మాయి ముద్దు పెట్టుకున్నపుడు నవ్వులు చిందించాడు. ఈ పరిణామానికి అతను కంగారు పడ్డాడు. కొన్ని క్షణాలకు తేరుకుని లైవ్‌ రిపోర్టింగ్‌ కొనసాగించాడు.


ఓ మహిళా రిపోర్టరును లైవ్‌లో ఓ రష్యన్‌ యువకుడు ముద్దు పెట్టడం ఎంత వైరల్ అయ్యిందో అంత విమర్శలపాలైంది. మహిళలకు భద్రత లేదని ప్రపంచవ్యాప్తంగా నెటిజనులు అప్పట్లో షేర్ల మీద షేర్లు చేసారు. మరి మహిళా రిపోర్టరుపై జరిగింది లైంగిక వేధింపులు అయితే.. పురుష రిపోర్టరుపై జరిగింది ఏమిటి? అని ఇప్పుడు మరో వర్గం నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో కాస్తా ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ముద్దుపై కొరియా మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ‘వరల్డ్‌కప్‌ కవరేజ్‌ కోసం రష్యా వెళ్లిన మా జర్నలిస్టును ఇద్దరు రష్యా మహిళా అభిమానులు లైంగికంగా వేధించారు’ అని ఎంబీఎన్‌ చానల్‌ మాత్రమే ట్విట్టర్‌లో స్పందించించడం కొసమెరుపు.