చిరు సినిమాకు నిర్మాతగా కొరటాల…?

Kortala Shiva To Be A Producer Of Chiru Film

కొన్ని చిత్రాలను తెరకెక్కించి అతి కొద్ది సమయంలోనే స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన కొరటాల శివ త్వరలో చిరంజీవిని డైరెక్ట్‌ చేయబోతున్నాడు. కొరటాల తెరకెక్కించిన అన్ని చిత్రాలు కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుని భారీ వసూళ్లను రాబట్టాయి. చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరు తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కొరటాల చిరు కోసం మంచి స్క్రిప్టును రెడీ చేసే పనిలో పడ్డాడు.

chiranjeevi

కొరటాల చిత్రాలు అన్నీ కూడా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టాయి. దాంతో తాను కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని ఆలోచన చేస్తునట్టు సమాచారం. చిరు హీరోగా నటించే ఈ చిత్రాన్ని యువసుధ బ్యానర్‌పై తెరకెక్కించాలని కొరటాల ప్లాన్‌ చేస్తున్నాడు. ఇకపోతే ఈ చిత్రానికి కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టి నిర్మాతగా మారనున్నాడు. తన చిత్రాలపై ఉన్న నమ్మకంతోనే కొరటాల ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొదటగా చిన్న ట్రయల్‌ వేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచనలో కొరటాల ఉన్నట్టు సమాచారం అందుతోంది.

chiru-movies