పాక్ సెనేట్ లో తొలి హిందూ ద‌ళిత మ‌హిళ‌

Krishna Kumari Kolhi becomes first Dalit woman senator in Pakistan
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ముస్లింల ఆధిప‌త్య దేశం అయిన పాకిస్థాన్ లో అరుదైన ఘ‌టన చోటుచేసుకుంది. పాక్ సెనెట్ కు తొలి హిందూ ద‌ళిత మ‌హిళ ఎన్నిక‌య్యారు. సింధు ప్రావిన్స్ కు చెందిన కృష్ణ‌కుమారి కోల్హీ ఈ ఘ‌న‌త సాధించారు. 39 ఏళ్ల కృష్ణ‌కుమారి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ త‌రపున సింధు ప్రావిన్స్ నుంచి గెలుపొందారు. కృష్ణ‌కుమారి థార్ జిల్లాలోని నాగ‌ర్ ప‌ర్కార్ అనే మారుమూల గ్రామంలో ఓ పేద‌కుటుంబంలో జ‌న్మించారు. ఆమె చిన్న‌త‌నంలో కుటుంబంతో క‌లిసి మూడేళ్ల‌పాటు జైలుజీవితం గ‌డిపారు.
16 ఏళ్ల వ‌య‌సులో తొమ్మిదోత‌ర‌గ‌తి చ‌దువుతున్న స‌మ‌యంలో లాల్ చంద్ అనే వ్య‌క్తిని పెళ్లిచేసుకున్నారు. వివాహం అనంత‌రం కూడా చ‌దువు కొన‌సాగించిన కృష్ణ‌కుమారి 2013లో సింధు యూనివ‌ర్శిటీ నుంచి సోషియాలజీలో మాస్ట‌ర్స్ పూర్తిచేశారు. అనంత‌రం త‌న సోద‌రునితో క‌లిసి పీపీపీలో చేరి..బెరానో  యూనియ‌న్ కౌన్సిల్ చైర్మ‌న్ గా ఎన్నిక‌య్యారు. థార్ ఇత‌ర ప్రాంతాల్లో అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కుల కోసం పోరాడి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కృష్ణ‌కుమారి మ‌హిళ‌ల‌కోటాలో సింధు ప్రావిన్స్ టికెట్ ద‌క్కించుకున్నారు. పాక్ లో మహిళ‌ల అభ్యున్న‌తి, మైనార్టీల హ‌క్కుల సాధ‌న‌లో కృష్ణ‌కుమారి గెలుపు ఓ మైలురాయిగా నిలిచిపోతుంద‌న్న విశ్లేష‌ణలు వెలువడుతున్నాయి. కృష్ణ‌కుమారిక‌న్నా ముందు ర‌త్న భ‌గ‌వ‌న్ దాస్ అనే హిందూ మ‌హిళ‌ను పీపీపీ గ‌తంలో సెనేట‌ర్ గా ఎన్నుకుంది. ఈ సారి మ‌రో అడుగు ముందుకు వేసి ద‌ళిత‌మ‌హిళ‌కు అవ‌కాశం క‌ల్పించింది.