కృష్ణార్జున‌యుద్దం టీజ‌ర్ రిలీజ్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

krishnarjuna yuddham movie Teaser released

నేచుర‌ల్ స్టార్ నానీ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్న కృష్ణార్జున యుద్ధం టీజ‌ర్ రిలీజ‌యింది. ఓ పాత్ర‌లో నాని క్లాస్ గా, మ‌రో పాత్ర‌లో మాస్ హీరోగా న‌టిస్తున్నాడు. యాడున్నార్రా గోపిక‌లు అని నాని అడ‌గ‌గానే హీరోయిన్లు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్స‌ర్ మీర్ టీజ‌ర్ లో క‌నిపించారు. కృష్ణ పాత్ర‌లో నాని ఆడోళ్లు క‌ఠినాత్ములు అంటుండ‌గా… అర్జున్ పాత్ర‌లో నాని మాత్రం అమ్మాయిల‌ను ప‌డేయ‌డం ఎంత ఈజీనో చెప్తున్నాడు.

రామాయ‌ణమంతా విని ధ‌ర్మరాజు ఎవ‌రు అని అడిగిన‌ట్టుంది అని నాని జోక్ చేయ‌డం… రామాయ‌ణంలో ధ‌ర్మ‌రాజుంటాడు, కృష్ణంరాజు, ఎడిట‌ర్ గౌతంరాజు కూడా ఉంటాడు అన్న జోక్ న‌వ్వు తెప్పిస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న కృష్ణార్జున‌యుద్ధానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వేస‌వి సెల‌వుల సంద‌ర్భంగా ఏప్రిల్ 12న‌ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.