టీఆర్ఎస్ అప్పుడే మొదలు పెట్టేసింది…!

KTR Announces Vinod As Karimnagar Lok Sabha Contestant

తెలంగాణ జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తెరాస జోరు చూపిస్తోంది. నాలుగు ప్రధాన పార్టీలతో కలిసి ఏర్పాటైన ప్రజాకూటమిని చిత్తుగా ఓడించడం ఆ పార్టీ నేతల్లో తమకిక ఎదురులేదనే భావన వచేసింది. అందుకోసమే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. వీటితో పాటు మరో మూడు నాలుగు నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల పైనా టీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. అందుకే ఇప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో బలాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గానూ, ఆ పార్టీ 11 చోట్ల విజయం సాధించింది. మిగిలిన ఆరు స్థానాల్లో రెండు కాంగ్రెస్ ఖాతాలోకి చేరగా టీడీపీ, మజ్లీస్, బీజేపీ, వైసీపీ తలో ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆ తర్వాత వారనదరూ తెరాస కారేక్కరు అనుకోండి. అందుకే ఇప్పుడు మాత్రం 17లో 16 నియోజకవర్గాల్లో గెలిచి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కావాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అందుకోసం ముందుస్తు ఎన్నికలకు అప్లై చేసిన అభ్యర్థుల ప్రకటన ప్లాన్ నే ఇప్పుడూ అమలు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పేరును ప్రకటించాడు కేటీఆర్. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఎంపీలందరూ బాధపడకండని సిట్టింగులకే సీట్లు దక్కుతాయని ప్రకటించారు.

దీంతో ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఎంపీలుగా కొనసాగుతున్న వారికే టికెట్లు కన్ఫార్మ్ అనే ప్రచారం మొదలైంది. మరోవైపు, కొంత మంది నేతలు సిట్టింగులకు పోటీగా వర్గాలను ఏర్పాటు చేసుకుని, టికెట్ కోసం అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట. దీంతో ప్రస్తుత ఎంపీల్లో కొందరు భయపడుతున్నారని ఈ విషయం తెలిసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకే ఒక్కొక్కరుగా అభ్యర్థులను ప్రటించాలని భావిస్తున్నాడని టాక్. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే మొదటి ఎంపీ అభ్యర్థిని ప్రకటించాడాయన. సిరిసిల్లలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బి.వినోద్ కుమార్ పేరును కేటీఆర్ ప్రకటించారు. వినోద్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున వినోద్, కాంగ్రెస్ నుంచి పొన్నం, బీజేపీ నుంచి విద్యాసాగర్ రావు పోటీ చేయగా కారు పార్టీ అభ్యర్థి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే కేంద్రం నుండి చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ ఇక్కడి నుండి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చయి. అయితే ఇప్పుడు కేటీఆర్ వినోద్ పేరు ప్రకటించడంతో కాస్త క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.