జ‌పాన్ లో సూపర్ స్టారే కాదు… మెగాస్టారూ ఉన్నారు

KTR tweets to Chiru photo in Japan Suzuki museum

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగాస్టార్ చిరంజీవి పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న‌కు కోట్లాదిమంది అభిమానులున్నారు. సినిమాల‌కు స్వ‌స్తి ప‌లికి రాజ‌కీయాల్లోకి వెళ్లినా ఆయ‌న ఫేమ్ త‌గ్గ‌లేదు. ఇప్ప‌డు మ‌ళ్లీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాల‌కో లేకుంటో ఒక్కమ‌న‌దేశానికో ప‌రిమితం కాదు. ఆయ‌న ఖ్యాతి ఖండాంత‌రాలు దాటింద‌న‌డానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటోనే ఉదాహ‌ర‌ణ‌.

కేటీఆర్ ప్ర‌స్తుతం జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. జ‌పాన్ అన‌గానే అంద‌రికీ త‌మిళ‌సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గుర్తుకొస్తారు. ఆ దేశంలో ర‌జ‌నీకి పెద్ద సంఖ్య‌లో అభిమానులున్నారు. ఆయ‌న‌కే కాదు… చిరంజీవికి జ‌పాన్ లో అశేష అభిమానులున్నారు. కేటీఆర్ జపాన్ ప‌ర్య‌ట‌న‌లో ఈ విష‌యం తెలిసింది. షిజ్వోకా ప్రాంతంలోని హ‌మామ‌ట్సు అనే చిన్న ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించారు. అక్క‌డ ఉన్న సుజుకి మ్యూజియంను సంద‌ర్శించారు. ఈ ప‌ర్య‌ట‌న చాలా అద్భుతంగా అనిపించింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక్కడ ఎవ‌రి ఫొటోను చూశానో ఊహించ‌గ‌ల‌రా…? మ‌న మెగాస్టార్ చిరంజీవి. మ‌న మాతృభూమికి చెందిన వారి ఫొటో హ‌మామ‌ట్సులాంటి చిన్న ప‌ట్ట‌ణంలో చూడ‌డం గ‌ర్వంగా అనిపించింది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మ్యూజియంలో ఉన్న చిరంజీవి చిత్రప‌టం ముందు నిల‌బ‌డి దిగిన ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు.