బాబు అరెస్ట్‌పై తెలంగాణ రాజకీయాలపై కేటీఆర్ స్ట్రాటజీ..పనిచేస్తుందా.. ?

KTR's strategy on Telangana politics on Babu's arrest...will it work?
KTR's strategy on Telangana politics on Babu's arrest...will it work?

చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. బాబు అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేసేవారు ఉన్నారు..సమర్ధించే వారు ఉన్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో బాబు అరెస్ట్ పై స్పందిస్తూనే ఉన్నారు. అయితే పక్కనే తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. చాలామంది నాయకులు ఆ పార్టీలోని బాబు అరెస్ట్‌ని ఖండిస్తూ వచ్చారు. అది వారి వ్యక్తిగతమే అని చెప్పవచ్చు. ఇటు బి‌జే‌పి, అటు కాంగ్రెస్ నేతలు సైతం బాబు అరెస్ట్‌ని ఖండించారు.

తెలంగాణలో ఉండే ఐటీ ఉద్యోగులు, పలు వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. కేవలం ఎం‌ఐ‌ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం బాబు అరెస్ట్‌ని సమర్ధించారు. కానీ బి‌ఆర్‌ఎస్ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపై పదే పదే కే‌టి‌ఆర్‌కు ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో..పక్క రాష్ట్ర అంశంపై తమకు సంబంధం లేదని, ఇది రెండు రాజకీయ పార్టీల సమస్య అని చెప్పుకొచ్చారు. అక్కడ అంశంపై తెలంగాణలో నిరసనలు తెలియజేయడానికి లేదని, ఇక్కడ శాంతిభద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే ఆంధ్రాలోనే తేల్చుకోవాలని అన్నారు.

అయితే కే‌టి‌ఆర్ వ్యాఖ్యలపై రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువ స్పందన వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా నిరసన తెలియజేసే హక్కు ఉందని, పైగా టి‌డి‌పి తెలంగాణలో పుట్టిందని, చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సి‌ఎంగా చేశారని, తెలంగాణలో టి‌డి‌పి ఉందని, అలాంటప్పుడు నిరసన తెలియజేయకూడదని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.

పక్క రాష్ట్రంతో సంబంధం లేకపోతే..ఏపీలో బి‌ఆర్‌ఎస్ ఎందుకు పెట్టారు. అక్కడ నేతలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అయితే కే‌టి‌ఆర్ న్యూట్రల్ గా ఉండాలనే స్ట్రాటజీతో ఉన్నారు. కర్రా విరగగూడదు..పాము చావు కూడదు అన్నట్లు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో టి‌డి‌పి, వైసీపీని అభిమానించే వారు ఉన్నారు. ఇది బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టమే.