మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేష్..

Nara Lokesh responded to Minister KTR's comments.
Nara Lokesh responded to Minister KTR's comments.

నిన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లోకేష్ తనకు ఫోన్ చేశాడని.. తెలంగాణలో ఆంధ్రా లొల్లి వద్దని.. రాజమండ్రి దద్దరిల్లిపోయేటట్టు నిరసన తెలపండని సూచించాడు. అదేవిధంగా తెలంగాణ ఐటీ కారిడార్ సస్యశ్యామలంగా ఉందని.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఐటీ ఉద్యోగులు ర్యాలీలు, నిరసనలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ వీరికి అనుమతి ఇస్తే.. వీరిని చూసి మరొకరు ఇలా రెచ్చిపోతుంటారని పేర్కొన్నారు.

తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాడు. రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా తెలుగోళ్లు ఎక్కడున్నా.. వారందరూ రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు గారికి మద్దతుగా ధర్నాలు, నిరసనలు,రాస్తారోకోలు తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. దాంట్లో తప్పులేదు. శాంతియుతంగా వారు బయటికొచ్చి మద్దతు తెలుపుతుంటే.. దానికి వారందరూ ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.