కేవీపీ ఒంట‌రిపోరాటం

KVP protest in parliament
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పార్ల‌మెంట్ ముందు గాంధీ విగ్ర‌హం సాక్షిగా కేవీపీ ప్ల‌కార్డు చేత‌బట్టుకుని నిల్చున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఏపీకి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా మూడురోజుల నుంచి కేవీపీ రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న చేస్తున్నారు. వెల్ ముందు నిల్చుని ప్ల‌కార్డు ప‌ట్టుకుని  నినాదాలు చేస్తున్న కేవీపీకి ఒక్క  కాంగ్రెస్ ఎంపీ నుంచి కూడా మ‌ద్ద‌తు దొర‌క‌లేదు. ఆయ‌న ఒంట‌రిగానే ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో సొంత పార్టీ ఎంపీలు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌క‌పోగా… వెల్ నుంచి వెన‌క్కి రావాల‌ని పిలుస్తున్నారు. మ‌రో ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ కేవీపీ వైఖ‌రిని తాము స‌మ‌ర్థించ‌బోవ‌డం లేద‌ని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌తో కేవీపీ మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. అదే స‌మ‌యంలో 255వ నిబంధ‌న కింద బ‌య‌ట‌కు వెళ్లాల‌ని ఆదేశిస్తాన‌ని చైర్మ‌న్ స్థానంలో ఉన్న వెంక‌య్య అన‌డంతో కేవీపీ స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ప్ల‌కార్డు ప‌ట్టుకుని పార్ల‌మెంట్ ముందు నిల‌బ‌డ్డారు.