“దేవర” సెకండ్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్ …!

Latest update on "Devara" second single...!
Latest update on "Devara" second single...!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్టీఆర్ అభిమానుల్లో మాస్ ఆడియెన్స్ లో భారీ హైప్ ఉన్న ఈ మూవీ నుంచి ఆల్రెడీ వచ్చిన ఫియర్ సాంగ్ మాత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక అంతా రెండో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక దీనిపై లేటెస్ట్ అప్డేట్ బాగా వినిపిస్తోంది.

Latest update on "Devara" second single...!
Latest update on “Devara” second single…!

దీని ప్రకారం ఈ మూవీ రెండో సాంగ్ పై క్లారిటీ ఈ వీకెండ్ కు వస్తుంది అని తెలుస్తోంది. తారక్ జాన్వీ లపై బ్యూటిఫుల్ పోస్టర్ తో మెలోడీ సాంగ్ ను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉన్నది . ఇక ఈ భారీ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సెప్టెంబర్ 27న మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.