ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!
Cinema News

మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కాస్త గ్యాప్ ఎక్కువ తీసుకున్నా ఆ గ్యాప్ కి తగ్గట్టుగా కొన్నాళ్ళు గుర్తుండే మంచి మూవీ తోనే వస్తారని తెలిసిందే. మరి అలా ఇప్పుడు కోలీవుడ్ నటుడు ధనుష్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ అయినప్పటికీ ఇంకా షూటింగ్ అయితే మొదలు కాలేదు.

ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!
Sekhar Kammala, Hero Dhanush

ఇక ఎట్టకేలకు మేకర్స్ అయితే ఈ సినిమాని మొదలు పెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం అయితే మూవీ వచ్చే కొత్త ఏడాది జనవరిలో ముంబై తదితర ప్రాంతాల్లో స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అని తెలుస్తోంది అలాగే తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.