“హను మాన్” 3డి వెర్షన్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్.!

“హను మాన్” 3డి వెర్షన్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్.!
Cinema News

ప్రస్తుతం మన టాలీవుడ్ మూవీ దగ్గర సెన్సేషనల్ గా మరిన లేటెస్ట్ మూవీ “హను మాన్. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ లో ఈ మూవీ “హను మాన్” 3డి వెర్షన్ అంటూ కొన్ని రూమర్స్ బయటకి వచ్చాయి.

అయితే దీనిపై ఇప్పుడు మరింత క్లారిటీ వినిపిస్తుంది. మేకర్స్ హను మాన్ 3డి వెర్షన్ ను కూడా సిద్ధం చేస్తున్నారంట . ఈ మూవీ 3డి వెర్షన్ విషయంలో ప్రశాంత్ వర్మ స్పెషల్ ఇంట్రెస్ట్ గా ఉన్నాడని అలాగే ఇప్పుడు 3డి టెస్ట్ లో కూడా తాను ఉన్నాడని తెలుస్తుంది.

“హను మాన్” 3డి వెర్షన్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్.!
Hanuman Movie

ఇక ఈ వెర్షన్ లో అయితే ఈ ఏడాదిలోనే వేసవి కానుకగా రిలీస్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా టాక్. మరి ఇండియా లోనే కాకుండా వరల్డ్ వైడ్ తాము అనౌన్స్ చేసిన ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని తాము సన్నాహాలు చేస్తున్నట్టుగా ఇప్పుడు బజ్. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉంది.