పవర్ స్టార్ “ఓజి” డేట్ అదే కావాలి…ఫ్యాన్స్.?

పవర్ స్టార్ “ఓజి” డేట్ అదే కావాలి...ఫ్యాన్స్.?
Cinema News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి పవన్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ గా మారిన ఈ సినిమా రిలీజ్ పై లేటెస్ట్ గా కొన్ని వార్తలు బయటకి వచ్చాయి. మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 27 కి ఫిక్స్ అయ్యింది అని టాక్ వచ్చింది.

దీనితో ఈ వార్త బయటకి రాగానే ఫ్యాన్స్ మాత్రం సెంటిమెంట్ గా మరో మాట మాట్లాడకుండా ఈ డేట్ ను ఫిక్స్ చేసెయ్యండి అంటూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ను కోరుతున్నారు. గత దశాబ్ద కితం అదే డేట్ లో వచ్చిన “అత్తారింటికి దారేది” మూవీ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యి టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది.

పవర్ స్టార్ “ఓజి” డేట్ అదే కావాలి...ఫ్యాన్స్.?
Pavan Kalyan ” OG “

దీనితో మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే డేట్ లో తాము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్ట్రైట్ మూవీ ఓజి కావడంతో అదే డేట్ లో ఈ మూవీ ని రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే మేకర్స్ ఆల్రెడీ అదే డేట్ ని ఫిక్స్ చేసారని అలా చేశాకే ఈ డేట్ వార్తల్లోకి వచ్చింది. సో ఫ్యాన్స్ ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోనక్కర్లేదు. కాకపోతే దీనిపై అఫీషియల్ క్లారిటీ ఒక్కటే రావాల్సి ఉన్నది