“పుష్ప 2” షూట్ పై లేటెస్ట్ అప్డేట్ .!

“పుష్ప 2” షూట్ పై లేటెస్ట్ అప్డేట్ .!
Cinema News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా అవైటెడ్ సీక్వెల్ సినిమా “పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా షూటింగ్ ని దర్శకుడు సుకుమార్ అండ్ టీం అయితే శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మరి రీసెంట్ గానే ఒక భారీ షెడ్యూల్ ని మేకర్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

“పుష్ప 2” షూట్ పై లేటెస్ట్ అప్డేట్ .!
Allu Arjun ” Pushpa-2 “

అయితే ఇక నెక్స్ట్ వీక్ నుంచి పుష్ప లో ఒక సాంగ్ ని మేకర్స్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం కొంత టాకీ పార్ట్ కొనసాగుతూ ఉండగా దాని తర్వాత సాంగ్ షూట్ ని స్టార్ట్ చేయనున్నారని బజ్ వినిపిస్తుంది. దీనితో ఇప్పటివరకు సినిమా సుమారు 65 నుంచి 70 శాతానికి చేరుకుంటుంది అని బాగా టాక్ వస్తుంది . ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సుకుమార్ మరియు మైత్రి సినిమా మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.