చిన్నమ్మకు షాకిచ్చిన పోలీసమ్మ

Letter Sent By DIG Roopa To The Prisons Department

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హాయిగా ఉన్న ప్రాణాన్ని ఇరకాటంలో పడేశారు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్. తన పనేదో తాను చేసుకోవాలని గానీ.. మధ్యలో చిన్నమ్మను ఎందుకు కెలికారని.. తంబీలు తెగ ఇదైపోతున్నారు. ఇన్నాళ్లూ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో రాజభోగాలు అనుభవించిన శశికళకు దిమ్మ తిరిగే షాకిచ్చారు పోలీస్ ఆఫీసర్ రూప.

రూప కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ. జైళ్లన్నీ ఇన్స్ పెక్షన్ చేయడం,ఏమైనా తేడా ఉంటే రిపోర్ట్ ఇవ్వడం ఇదీ రూప డ్యూటీ. తన విధుల్లో భాగంగా పరప్పన అగ్రహార జైలుకెళ్లిన రూపకు.. ఆశ్చర్యం కలిగించే పరిస్థితులు కనిపించాయి. ఏకంగా ఉన్నతాధికారులు కూడా లంచం తీసుకుని శశి అడుగులకు మడుగులొత్తడం ఆమె సహించలేకపోయారు.

అందుకే పై స్థాయి అధికారులకు ఘాటుగా లేఖ రాశారు. పరప్పన అగ్రహార జైల్ అవినీతి మయమైందని, అక్కడ సిబ్బంది డబ్బులు తీసుకుని వీఐపీ ఖైదీలకు రాచమర్యాదలు చేస్తున్నారని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో పరప్పన సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అటు అధికారులు కూడా చిన్నమ్మను వేరేచోటకు తరలించే ప్లాన్ చేస్తున్నారు.

 మరిన్ని వార్తలు:

కలియుగంలోనూ మహాభారతం

కేసీఆర్ బడాయి ఎక్కువైంది