కేసీఆర్ బడాయి ఎక్కువైంది

congress senior leader jeevan reddy about CM KCR,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కాంగ్రెస్ లో బలమైన నేతల్లో ఒకరు జీవన్ రెడ్డి. ఆయన మూడు దశాబ్దాలుగా మాస్ లీడర్ గా గుర్తింపు పొందుతున్నారు. అసెంబ్లీలో కూడా జీవన్ రెడ్డే కేసీఆర్ ను ఎక్కువ ఇరుకునపెట్టారు. కాంగ్రెస్ నేతలు గొర్రెలన్న కేసీఆర్ కామెంట్లపై ఆయన విరుచుకుపడ్డారు. తాము కేసీఆర్ లాగా తోడేళ్లం కాదని ఘాటుగా జవాబిచ్చారు.

సంక్షేమంలో నంబర్ వన్ అని చెప్పుకుంటున్న కేసీఆర్.. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను ఎందుకు నీరుగార్చారని ప్రశ్నించారు. తమ సీఎం వైఎస్ చేసిన దాంట్లో ఆవగింజలో అరవై వంతు కూడా చేయని కేసీఆర్.. తానేదో ఉద్ధరిస్తున్నట్లు చెప్పుకోవడం మిలీనియం జోక్ అన్నారు జీవన్ రెడ్డి.

వైఎస్ అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చి కేసీఆర్ చేస్తున్నారని, అంతకు మించి సొంతంగా చేస్తున్న పథకం ఒక్కటీ లేదని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ సొంత స్కీములైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గొర్ల పంపిణీ లాంటి పథకాలన్నీ అవినీతిమయమని విమర్శించారు జీవన్ రెడ్డి.

మరిన్ని వార్తలు

భారత్ తరపున అమెరికాలో వాదనలు

అప్పుడు పతంజలి.. ఇప్పుడు పరాక్రమ్