చైనాకు అమెరికా వార్నింగ్

American Warning for China In Army War Issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కమ్యూనిస్టు చైనాకు పెట్టుబడిదారీ దేశమైన అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మిగతా చిన్న దేశాలతో పెట్టుకున్నట్లు భారత్ తో యుద్ధానికి దిగితే మీ గొయ్యి మీరు తవ్వుకున్న్టట్లేనని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఎప్పుడూ ఇండియా గురించి ఇంత గొప్పగా చెప్పలేదు. చైనా అందరికీ ముప్పుగా మారుతున్న తరుణంలో.. అగ్రరాజ్యం ఈ ఎత్తు వేసినట్లు భావిస్తున్నారు.

కానీ అమెరికా చెప్పిన మాటల్లో అబద్ధం మాత్రం లేదు. ఎందుకంటే భారత్ అణ్వాయుధ శక్తి చాలా ఎక్కువగానే ఉంది. పైగా గతంలో లాగా వ్యూహం లేకుండా ఏ పనీ చేయడం లేదు ఇండియా. అందుకే చైనా కూడా దుందుడుకు చర్యలకే పరిమితమవుతూ.. యుద్ధాన్ని మాత్రం కోరుకోవడం లేదు. యుద్ధమే వస్తే భారత్ ను తాము నాశనం చేసేలోపు.. చైనాను భారత్ టార్గెట్ చేస్తుందని డ్రాగన్ కు తెలుసు.

ఇక ఆర్మీ కూడా చైనా ఆర్మీతో పోలిస్తే.. భారత్ ఆర్మీకి విభిన్న పరిస్థితుల్లో యుద్ధం చేసే అనుభవం ఉంది. చైనా ఆర్మీ భారత్ సరిహద్దుల్లోకి వచ్చి యుద్ధం చేయడం గతంలో మాదిరి సులభం కాదు. అసలు ఆర్మీ రంగంలోకి దిగకుండానే నేచురల్ డిజార్డర్స్, మానవ రహిత విమానాలతో భారత్ విధ్వంసం సృష్టిస్తుందని అమెరికా చైనాను హెచ్చరిస్తోంది.

 మరిన్ని వార్తలు: