కలియుగంలోనూ మహాభారతం

mahabharata-story-repeat-in-madhya-pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పురాణాల్లో రామాయణంతో పోలిస్తే మహాభారతానికి కలికాలంతో చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. అందుకే తెరపైన కూడా రామాయణం కంటే మహాభారతమే బాగా ఆడింది. అందుకే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చెలరేగిపోతున్నారు దుర్మార్గులు. భారతంలో మంచి లక్షణాలు వదిలేసి.. చెడు లక్షణాలకు దాసోహమంటున్నారు.

భారతంలో ద్రౌపదిని పణంగా పెట్టి ధర్మరాజు జూదమాడితే.. ఇప్పుడు సేమ్ సీన్ మధ్యప్రదేశ్ లో రిపీటైంది. ఇక్కడ కూడా ఓ భర్త జూదమాడి ఓఢిపోయి.. తన భార్యను ఇద్దరు వ్యక్తులకు అప్పగించారు. వారు ఆమెపై అత్యాచారం చేయడంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో పోలీసులు అందర్నీ విచారణకు పిలిచారు.
వారాంతపు పోలీస్ దర్బార్ లో భాగంగా బాధితురాలు తన గోడు వెళ్లబోసుకుంది. తానిప్పుడు భర్తకు దూరంగా ఉంటున్నా కూడా ఆ ఇద్దరు ఇంకా వేధిస్తూనే ఉన్నారని, ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరింది. దీంతో స్పందించిన మహిళా పోలీస్ అధికారులు.. విచారణ తర్వాత నిజాలు నిగ్గు తేలుస్తామని హామీ ఇచ్చారు.

 మరిన్ని వార్తలు:

చైనాకు అమెరికా వార్నింగ్

అప్పుడు పతంజలి.. ఇప్పుడు పరాక్రమ్