తెలంగాణలో లాక్‌డౌన్‌

తెలంగాణలో లాక్‌డౌన్‌

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రంజాన్‌ పండుగ (శుక్రవారం) మరుసటి రోజు నుంచి అంటే.. ఈనెల 15 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు న్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. పూర్తిగా అదుపులోకి రాని కరోనా కేసులకు అడ్డుకట్ట వేయా లంటే లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు అధి కారవర్గాల సమాచారం.

దాదాపుగా పొరుగు రాష్ట్రా లన్నీ ఇప్ప టికే లాక్‌డౌన్‌ విధించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 18 గంటల కర్ఫ్యూ అమలవు తుంటే.. రాష్ట్రంలో మాత్రం రాత్రి కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉంది. పగటిపూట అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతుండటంతో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గడం లేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బాధితులకు నగరంలోని అనేక ఆçస్పత్రుల్లో పడకలు సైతం లభించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ అనివార్యమనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.