ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమ జంట ఆత్మహత్య

జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అడవిలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలనానికి చేరుకొని పరిశీలిసుస్తున్నారు. మృతి చెందిన వారిని మోస్రా మండలం తిమ్మాపూర్‌కి చెందిన మోహన్, లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వారం నుంచి చెట్టుకు మృతదేహాలు వేలాడుతున్నట్లు తెలుస్తోంది.