మగాళ్ళు క్రమశిక్షణతో ఉన్నా, ఇండస్ట్రీలో అమ్మాయిలే ఆఫర్ చేస్తారు

lyrics writer shreshta Talks About US chicago sex racket

ఏ క్షణాన శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేసిందో గానీ ఆ వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటోంది. తాజాగా ఓ మాజీ తెలుగు సహా నిర్మాత షికాగోలో సెక్స్ రాకెట్ నడుపుతూ అడ్డంగా బుక్కయ్యాడు. అనేక మంది హీరోయిన్లు, యాంకర్ లు తాము అతని బారిన పడాల్సిన వాళ్ళం దేవుడి దయ వల్ల బయట పడ్డామని చెప్పుకొచ్చారు. అయితే అమెరికన్ సెక్స్ రాకెట్ విషయంలో తనకూ చేదు అనుభవం ఎదురైందని అర్జున్ రెడ్డి – పెళ్లి చూపులు సినిమాలకు పాటలు రాసిన శ్రేష్ట వాపోయింది. కేవలం సినీ తారలే కాకుండా మహిళా గేయ రచయితలను కూడా ఇలాంటి వ్యవహారాలకు టార్గెట్ చేస్తుంటారని, నిర్మాత కిషన్ భార్య నన్ను సంప్రదించింది. డబ్బు ఆశజూపి ఈ ముగ్గులోకి దించాలని చూసిందని అని సినీ రచయిత శ్రేష్ట వెల్లడించారు. ‘ఓసారి మహిళా దర్శకురాలు ఫోన్ చేసి ఓ నిర్మాత గోవాలో గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడు. అందులో నన్ను పాల్గొనమని కోరింది. కానీ దానికి నేను తిరస్కరించాను. ఆ తర్వాత నన్ను బెదిరించారు. ఆ బెదిరింపులతో ఇండస్ట్రీకే దూరమయ్యాను’ అని శ్రేష్ట ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలు చెప్పింది.

సినీ పరిశ్రమలో మహిళలకు కేవలం మగవాళ్లతో ముప్పులేదని.. మహిళా ప్రముఖులు కూడా ఇలానే చేస్తారని.. ఈ దందాలోకి అమాయకులను లాగడం తరచూ జరుగుతోందని.. కుంభకోణాలు వెలుగుచూసినప్పుడే బయటపడతాయని శ్రేష్ట చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో చాలామంది మగవాళ్లు క్రమశిక్షణతో ఉన్నారని, కొందరు అమ్మాయిలే అవకాశాల కోసం తమను తాము ఆఫర్ చేసుకుంటున్నారని, ఇలాంటి అమ్మాయిలను తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలామందిని చూశానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో మగవాళ్లను హ్యాండిల్ చేయడం చాలా సులభమని కానీ ఆడవాళ్లతో చాలా కష్టమని ఆడవాళ్లే చాలా తీయటి మాటలు చెబుతారని, మనకే తెలియకుండా మనల్ని ఎవరికి ఆఫర్ చేస్తారో తెలియదని అందుకే ఆడవాళ్లతో వెళ్లాలంటే భయం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అదే మగాడు అయితే అతని హద్దుల్లో అతను ఉంటాడని అతడిని హద్దుల్లో పెట్టే అవకాశం మనకూ ఉంటుందని కానీ ఆడవాళ్లు అలా కాదు.. మన ఇళ్లకే దూసుకొని వచ్చేస్తారు, కాబట్టి ఆడవాళ్లను హద్దుల్లో పెట్టడం కష్టమని పేర్కొంది.