సస్పెన్స్‌ : ఎన్టీఆర్‌గా ఎవరు కనిపించబోతున్నారు?

Mahanati Team Suspense on Sr.NTR Role

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్‌ నటించిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో ఏయన్నార్‌ పాత్రను నాగచైతన్య చేసిన విషయం తెల్సిందే. అయితే ఎన్టీఆర్‌ పాత్ర కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎంపిక చేయాలని భావించారు. ఎన్టీఆర్‌ను ఈ చిత్రం కోసం సంప్రదించిన సమయంలో తాను ఆ పాత్రను చేయలేను అని, తాత పాత్రను చేయడం తన వల్ల కాదు అంటూ ప్రకటించాడు. స్వయంగా ఎన్టీఆర్‌ ఆ విషయాన్ని చెప్పిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ నో చెప్పడంతో ఆ పాత్రను ఎవరితో చేయించారు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. సినిమాలో అన్ని పాత్రలకు గాను మంచి నటీనటులు ఎంపిక అయ్యారు. ఎన్టీఆర్‌ పాత్ర అనగానే తన మదిలోకి ఎన్టీఆర్‌ వచ్చాడు. ఆయన్ను ఎన్టీఆర్‌ పాత్ర కోసం సంప్రదించాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన నో చెప్పాడు. ఎన్టీఆర్‌ నో చెప్పడంతో ఆ గొప్ప నటుడి పాత్రలో ఎవరిని నటింపజేయాలా అని చాలా ఆలోచించాం. చివరకు మా ప్రయత్నం ఏదో చేశాం. ఎన్టీఆర్‌ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేసిన విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఎన్టీఆర్‌ పాత్ర ఉంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా ఎవరు కనిపిస్తారో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది.