మహేష్‌ మూవీకి 150 కోట్ల బడ్జెట్‌…!

Maharshi Movie Budget Of 150 Crores

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రంగా ‘మహర్షి’ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంకు 90 నుండి 100 కోట్ల మేరకు నిర్మాతలు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మహేష్‌బాబు కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా ఈ చిత్రంను చెప్పుకుంటున్నారు. వచ్చే వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు వంశీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే మహేష్‌బాబు 26వ చిత్రానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

maharshi-movie

‘రంగస్థలం’ వంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న సుకుమార్‌ తన తదుపరి చిత్రంను మహేష్‌బాబుతో చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. మహేష్‌బాబుతో సుకుమార్‌ చేయబోతున్న సినిమాకు నిర్మాతలు ఏకంగా 150 కోట్ల బడ్జెట్‌ను పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మహేష్‌బాబు మరియు సుకుమార్‌ల పారితోషికాలే దాదాపుగా 50 కోట్లు ఉంటుందని, ఇక మిగిలిన తారల పారితోషికాలు 25 కోట్ల వరకు ఉంటాయి. ఇక సెట్స్‌ నిర్మాణం కోసం 25 కోట్లు, ఇతర ప్రొడక్షన్‌ కోసం 50 కోట్లను సుకుమార్‌ బడ్జెట్‌ ప్లాన్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి సుకుమార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. వచ్చే ఏడాది చివర్లో సినిమా వచ్చేలా సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

mahesh-sukumar