ముందస్తుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ : టీ.కాంగ్రెస్ మేనిఫెస్టో !

Telangana Congress Finalises Election Manifesto

తెలంగాణలో ముందస్తు ఖాయమైనట్లే అని అన్ని పార్టీలుఒక అభిప్రాయానికి వచ్చేశాయి. ఇప్పటివరకు ఊహాగానాలు అనుకున్న రాజకీయ పార్టీలు వేస్తున్న అడుగులు చూస్తుంటే టీ అసెంబ్లీ రద్దు పక్కా అనే విషయం తేటతేల్లమవుతోంది. దీంతో టీ కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. నిన్ననే తాము కూడా ఎన్నికలకు రెడీ అని ప్రకటించి ఈరోజు అందుకు సంబంధించి మరో స్టెప్ ముందుకేసింది. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డి నేతృత్వంలోని సమావేశమైన మేనిఫెస్టో కమిటీ.. పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా గాంధీభవన్‌ను ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ కమిటీ తీసుకున్న నిర్ణయాలను.. ఆ తాలూకూ వివరాలను ప్రకటించారు.

Telangana Congress

కాంగ్రెస్ పార్టీ ముందస్తు మానిఫెస్టోలో ఏముందంటే..

తెల్లరేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ.

తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కో వ్యక్తికి 6 కిలోలు సన్నబియ్యం

దళిత, గిరిజనులకు సన్నబియ్యం ఉచితం.

ఇల్లు లేనివారికి రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మరో రూ.లక్ష అదనంగా ఇస్తాం.

మిడ్‌ మానేరు నిర్వాసితులకు రెండు పడకగదుల ఇళ్లు

కల్యాణలక్ష్మి, బంగారు లక్ష్మి పథకం కొనసాగిస్తాం.

దివ్యాంగుల వివాహానికి రూ.2లక్షలు ఇస్తాం.

ఇందిరమ్మ ఇంటికి మరో గది నిర్మాణానికి రూ.2లక్షలు అందిస్తాం.

బీసీ, మైనారిటీలకు సబ్‌ ప్లాన్‌

ఉపాధి కల్పనకు ప్రాధాన్యత

ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితం

మత ప్రార్థన స్థలాలకు కొంత ఉచిత విద్యుత్

బీపీఎల్‌ కుటుంబాలకు 6 గ్యాస్‌ సిలెండర్లు ఉచితం

7వ తరగతి నుంచి ఇంటర్ చదివే అమ్మాయిలకు సైకిల్

ఆరోగ్య శ్రీ పరిధి రూ.5 లక్షల వరకు పెంపు.అన్ని రకాల వ్యాధులకు వర్తింపచేస్తాం

లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకం

గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్ల నిధి

కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తిస్తాం..

Telangana-Congress