విజయ్‌ మళ్లీ ముద్దు పెట్టినట్లున్నాడుగా…!

Vijay Deverakonda Lipkiss In Nota Movie
ప్రస్తుతం తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ హీరో, మోస్ట్‌ క్రేజీ హీరో అంటే ఠక్కున వినిపించే పేరు విజయ్‌ దేవరకొండ. కేవలం ఒక్క చిత్రంతో యూత్‌ ఐకాన్‌గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం తన ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంలో హీరోయిన్‌తో లెక్కకు మించి ముద్దులు పెట్టి ప్రేక్షకులను ముద్దుల్లో ముంచెత్తిన విజయ్‌ దేవరకొండ తాజాగా వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రంలో కూడా ముద్దు సీన్‌లో నటించాడు. కేవలం ముద్దు సీన్స్‌ కారణంగానే మనోడికి బాగా పేరు దక్కిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే తన తదుపరి చిత్రం ‘నోట’లో కూడా హీరోయిన్‌తో పెదవి పెదవి కలిపినట్లుగా తాజాగా విడుదలైన వీడియోలో తెలుస్తోంది.
nota
తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిన ‘నోట’ చిత్రం ట్రైలర్‌ను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ట్రైలర్‌కు ముందు సైలెంట్‌గా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. దీనికి నోట స్నీక్‌ పీక్‌ అంటూ పేరు పెట్టారు. ఈ వీడియోలో విజయ్‌ లుక్‌తో పాటు, ఎలాంటి నేపథ్యంలో సినిమా తెరకెక్కింది అనే విషయాన్ని చూపించడం జరిగింది. ఇక ఇదే వీడియోలో హీరోయిన్‌తో ముద్దు సీన్‌ కూడా ఉందని చెప్పకనే చెప్పారు. నోటాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో అక్టోబర్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Vijay Deverakonda Lipkiss In Nota Movie vijay-devarakonda-nota
దసరా సీజన్‌ను పూర్తిగా వినియోగించుకునేందుకు విజయ్‌ ప్రయత్నిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన నోటా చిత్రంకు ఎంత మేరకు కలెక్షన్స్‌ వస్తాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీత గోవిందం చిత్రంతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన విజయ్‌ తాజాగా ఈ చిత్రంతో కనీసం సగం వసూళ్లు రాబట్టినా కూడా సూపర్‌ హిట్‌ అన్నట్లే అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఈ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్న ఇతగాడు ఏ మేరకు సక్సెస్‌ను అక్కడ దక్కించుకుంటాడో చూడాలి.

విజయ్‌ మళ్లీ ముద్దు పెట్టినట్లున్నాడుగా...! - Telugu Bullet