ఫ్లాప్‌ దర్శకుడిపై బన్నీకి నమ్మకం…!

Naa Peru Surya Director Vakkantham Vamsi On Casting Allu Arjun

అల్లు అర్జున్‌ భారీ అంచనాలు పెట్టుకుని నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం దారుణమైన ఫ్లాప్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఎన్నో అంచనాల నడుమ ఆ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. ఎన్నో చిత్రాలకు మంచి కథను మరియు స్క్రీన్‌ప్లేను అందించిన వక్కంతం వంశీ ఇలాంటి చెత్త స్క్రీన్‌ప్లేతో సినిమాను తెరకెక్కించాడు ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. వంశీని నమ్ముకుని బన్నీ పెద్ద తప్పు చేశాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. నా పేరు సూర్య కారణంగా అల్లు అర్జున్‌ సినిమా ఎంపిక విషయంలో చాలా భయపడుతున్నాడు. నా పేరు సూర్య విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. కాని అల్లు అర్జున్‌ ఆరు నెలల గ్యాప్‌ తీసుకున్నాడు.

alluarjun-vamsi-banni

ప్రస్తుతం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. మొదట విక్రమ్‌ కుమార్‌ తీసుకు వచ్చిన కథలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేవని, అందుకే దాన్ని పూర్తిగా మార్చి స్క్రీన్‌ప్లేను కొత్తగా వక్కంతం వంశీతో బన్నీ రాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. నా పేరు సూర్య చిత్రంతో ఫ్లాప్‌ ఇచ్చినా కూడా ఆయనలో ఉన్న రచయితపై నమ్మకంతో వంశీకి బన్నీ ఛాన్స్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. మరో తమిళ దర్శకుడితో కూడా బన్నీ సినిమా చేసే అవకాశాలున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కబోతుంది. ఆ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌లో కూడా వక్కంతం వంశీ హ్యాండ్‌ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. రేసుగుర్రం సమయం నుండి వక్కంతం వంశీపై బన్నీకి చాలా నమ్మకం. అందుకే తన ప్రతి సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ సిట్టింగ్‌కు ఆయన ఉండాల్సిందే అని బన్నీ అంటాడు.

allu-arjun-vamsi