తెలంగాణలో ఆవిర్భవించిన మరో రాజకీయ పార్టీ!

new political party in telangana

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు హీట్ పెంచుతున్న నేపధ్యంలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ‘యువ తెలంగాణ’ పేరుతో కొత్త పార్టీ ప్రాణం పోసుకుంది. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య మీద పోరాడిన జిట్టా బాలకృష్ణారెడ్డి, హెచ్ ఎం టీవీలో దశ దిశ లాంటి కొన్ని ప్రత్యేక ప్రోగ్రాంలతో గుర్తింపు పొందిన రాణి రుద్రమలు సంయుక్తంగా ఈ కొత్త పార్టీని స్థాపించారు. బాలకృష్ణారెడ్డి పార్టీ అధ్యక్షుడిగా, రాణి రుద్రమ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని పార్టీ కోర్ కమిటీ నిర్ణయించింది. పర్యటనల సందర్భంగా పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

new-political-party-in-tela
యువత, మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని యువతకు, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. అలాగే రాణి రుద్రమ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వంలో మహిళలకు అవకాశాలు లేకుండా పోయాయన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. యువ తెలంగాణ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. వీరిద్దరూ కలిసి గతంలో వైసీపీలో పనిచేసారు. ఇక టికెట్లు తీసుకుని పోటీ చేయడమే ఆలస్యం అని భావిస్తున్న తరుణంలో ప్రత్యేక తెలంగాణా రావడం వీరి రాజకీయ ఎదుగుదలకి బ్రేక్ వేసింది. దీంతో ఇప్పుడు యువత పేరిట అదృష్టాన్ని మరో సారి పరీక్షించుకోడానికి ఇద్దరూ సిద్దమయ్యారు.

telangana