మహేష్‌ వార్నింగ్‌.. ఇంతకు మించి చెప్పలేను…!

Allari Naresh About His Movie With Mahesh Babu

మహేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’లో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం అవ్వడంతో అల్లరి నరేష్‌ పాత్రపై కూడా సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు మరియు ఆసక్తి నెలకొని ఉన్నాయి. అందుకే అల్లరి నరేష్‌ మీడియా ముందు కనిపిస్తే చాలు ‘మహర్షి’లో మీ పాత్ర ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా అల్లరి నరేష్‌, సునీల్‌ కలిసి నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అల్లరి నరేష్‌ మహేష్‌బాబు 25వ చిత్రంలో తన పాత్ర గురించి చిన్న క్లూ ఇచ్చాడు.

naresh-mahesh,

సిల్లీ ఫెలోస్‌ ప్రెస్‌మీట్‌లో నరేష్‌ మాట్లాడుతూ.. మహర్షి చిత్రం కోసం ఇప్పటి వరకు నేను 45 రోజులు వర్క్‌ చేశాను, ఇంకా 100 రోజులు ఆ సినిమా కోసం వర్క్‌ చేయాల్సి ఉంది. వచ్చే నెలలో నేను మళ్లీ మహర్షి షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నాను అంటూ అల్లరి నరేష్‌ చెప్పుకొచ్చాడు. ఇక గతంలో తాను నటించిన ‘గమ్యం’ చిత్రంలో గాలి శీను పాత్రకు మహర్షి చిత్రంలోని ఈ పాత్రకు చాలా సారుప్యత ఉంటుందని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.

allari-naresh

మహర్షి గురించి ఇంతకు మించి నేను చెప్పలేను అని, ఇంతకు మించి చెప్పొద్దు అంటూ మహేష్‌ వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ అల్లరి నరేష్‌ పేర్కొన్నాడు. మహర్షి చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

mahesh-babu-naresh