కంగనాపై సోనూసూద్‌ సంచలన వ్యాఖ్యలు

sonu sood comments on kangana ranaut

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా పేరున్న క్రిష్‌కు బాలీవుడ్‌లో చేదు అనుభవం ఎదురైన విషయం తెల్సిందే. ఈయన దర్శకత్వంలో మొదలైన హిందీ చిత్రం ‘మణికర్ణిక’ను ప్రస్తుతం కంగనా రనౌత్‌ హైజాక్‌ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం మణికర్ణిక కు కంగనా దర్శకత్వం వహిస్తుంది. అయితే చిత్ర నిర్మాతలు మాత్రం క్రిష్‌ ‘ఎన్టీఆర్‌’ చిత్రంతో బిజీగా ఉన్న కారణంగా చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో కంగనా దర్శకురాలి పాత్రను కూడా పోషిస్తుందని, అది కూడా కొన్ని సీన్స్‌ వరకు మాత్రమే అని, అధికారికంగా క్రిష్‌ తమ సినిమాకు దర్శకుడు అంటూ నిర్మాతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాని తాజాగా సోనూ సూద్‌ చేసిన వ్యాఖ్యలు అసలు విషయాన్ని తెలియజేస్తున్నాయి.

sonu-sood-comments-on-kanga

‘మణికర్ణిక’ చిత్రం కోసం తాను సెట్స్‌కు వెళ్లిన సమయంలో అక్కడ నాకు ఇద్దరు దర్శకులు కనిపించేవారు అంటూ చెప్పుకొచ్చాడు. అంటే క్రిష్‌తో పాటు కంనగా కూడా డైరెక్షన్‌ చేసేది అనేది ఆయన అభిప్రాయం. కంగనా పులు సార్లు క్రిష్‌కు సలహాలు ఇవ్వడంతో పాటు, క్రిష్‌ పనిలో జోక్యం చేసుకునేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కంగనా గతంలో కూడా పలు చిత్రాల్లో నటించిన సందర్బంగా వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. మణికర్ణిక చిత్రం మొత్తం కూడా కంగనా దర్శకత్వంలోనే తెరకెక్కుతుందని, క్రిష్‌కు ఎలాంటి స్కోప్‌ను ఆమె కలిగించలేదు అంటూ సోనూ సూద్‌ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అయితే ఆ క్రెడిట్‌ క్రిష్‌కు సక్సెస్‌ అయితే తనకు దక్కేలా కంగనా ప్లాన్‌ చేసుకుందని కొందరు విమర్శలు చేస్తున్నారు.

sonu-sood-comments-on-kanga