‘భరత్‌ అను నేను’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ డేట్లు కన్ఫర్మ్‌

mahesh-babu-bharat-ane-nenu-movie-first-look-and-teaser-dates-fixed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మహేష్‌బాబు, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం కోసం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. కాని షూటింగ్‌ అనుకున్న స్థాయిలో జరగక పోవడంతో చిత్రాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో మహేష్‌బాబు ఒక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా, సీఎంగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి. కాని చిత్రానికి సంబంధించిన అధికారిక లుక్‌ మాత్రం రివీల్‌ కాలేదు. సినిమా ఫస్ట్‌లుక్‌ను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్‌ 31 రాత్రి విడుదల చేయాలని నిర్ణయించారు.

mahesh-babu

ఈ చిత్రానికి టైటిల్‌గా ‘భరత్‌ అను నేను’ను పరిశీలిస్తున్నట్లుగా మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేయలేదు, అలాగని సమర్ధించలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘భరత్‌ అను నేను’ కాకుండా మరో టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌ 31న టైటిల్‌పై క్లారిటీ ఇచ్చి, మహేష్‌బాబు లుక్‌ను రివీల్‌ చేసే అవకాశం ఉంది. ఇక వచ్చే నెల 26న రిపబ్లిక్‌ డే సందర్బంగా టీజర్‌ను కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.

bharat-ane-nenu-movie

మహేష్‌బాబు, కొరటాల కాంబోలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ కారణంగా ఈ చిత్రానికి ఏకంగా 150 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానయ్య నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. స్పైడర్‌ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో ఈ చిత్రంపై మహేష్‌బాబుతో పాటు ఆయన అభిమానులు అంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందా అనేది ఫస్ట్‌లుక్‌, టీజర్‌తో తేలిపోనుంది.