మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ “సరిలేరు నీకెవ్వరు”

మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ “సరిలేరు నీకెవ్వరు”

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు” తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇలా “భరత్ అనే నేను” మరియు “మహర్షి” లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ను అందుకోవడంతో తన అభిమానులతో పాటుగా తాను చాలా హ్యాపీగా ఉన్నారు.అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ తన కుటుంబంతో ఓ వెకేషన్ కూడా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఇప్పుడొక షాకింగ్ వార్త బయటకు వచ్చింది.మహేష్ ఇదే వెకేషన్ లో భాగంగా తన మోకాలికి ఒక సర్జరీ చేయించుకోనున్నారని తెలుస్తుంది.

ఇంతకీ మహేష్ కు ఏమయ్యిందంటే గతంలో తాను హీరోగా నటించిన “ఆగడు” సినిమాలోని మొదటి సాంగ్ షూటింగ్ లో ఓ సీన్ దగ్గర మోకాలికి దెబ్బ తగలగా అప్పటికి ఓసారి సర్జరీ చేయించుకొని ఆ చిత్రాన్ని పూర్తి చేసేసారు.కానీ అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ యథావిధిగా షూటింగ్స్ నిర్విరామంగా కొనసాగించే సరికి మళ్ళీ ఇప్పుడు నొప్పి కాస్త ఎక్కువయ్యింది అని అందుకే ఇప్పుడు మరోసారి సర్జరీ చేయించుకోవాలని మహేష్ ఫిక్స్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.సో కొన్ని రోజుల కిందట “సరిలేరు నీకెవ్వరు” తర్వాత మహేష్ తన తదుపరి చిత్రానికి కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుంటారని వచ్చిన వార్తలు ఈ కారణం వల్లే అని చెప్పొచ్చు.