నిత్యమీనన్ కి పోటీగా మహేష్ బాబు కూతురు

నిత్యమీనన్ కి పోటీగా మహేష్ బాబు కూతురు

విలక్షణ పాత్రలకు చిరునామాగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిత్యమీనన్ కు మహేష్ కూతురు సితార సవాల్ విసిరింది. ఈ విషయాన్ని స్వయంగా నమ్రత లీక్ చేయడంతో మహేష్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. మహేష్ తన కూతురుని పెద్దది అయ్యాక న్యూక్లియర్ సైంటిస్ట్ గా మార్చాలని కలలు కంటుంటే సితార మాత్రం సినిమాల వైపు ఆకర్షింపబడుతోంది.

ఇప్పటికే అనేక సార్లు సితార చేసిన డాన్స్ లు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారిన నేపధ్యంలో ప్రస్తుతం సితారకు నమ్రత క్లాసికల్ డాన్స్ నేర్పిస్తోంది. ఇది ఇలా ఉంటే సితార ఒక హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పబోతు ఉండటం హాట్ న్యూస్ గా మారింది.

హాలీవుడ్ యానిమేటెడ్ ఫిలిం ‘ఫ్రోజెన్ 2’ తెలుగు వెర్షన్లో ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పింది. 2013 లో రిలీజ్ అయిన ‘ఫ్రోజెన్’ ఇప్పటి వరకూ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన యానిమేటెడ్ చిత్రాల్లో టాప్ లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు బెస్ట్ యానిమేటెడ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ కూడ వచ్చింది. ఇప్పుడు త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ సీక్వెల్ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ నేపధ్యంలో ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పడం పై నమ్రత స్పందిస్తూ “సితార ఫ్రోజెన్ ను చిన్నప్పటి నుంచి చూస్తోంది. అందులో ఎల్సా పాత్ర అంటే తన కు చాలా ఇష్టం. సరిగ్గా అదే పాత్ర కు డబ్బింగ్ చెప్పాలని డిస్నీ వారు కోరడంతో మేము నో చెప్పేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు డిస్నీ వారికి కృతజ్ఞతలు” అంటూ ట్విట్ చేసింది.

అంతేకాదు ఎల్సా క్యారెక్టర్ కు తెలుగు డబ్బింగ్ చెపుతున్నప్పుడు సితార బాగా ఎంజాయ్ చేసిన విషయాన్ని నమ్రత బయట పెట్టింది. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించిన ఎల్సా పాత్రకు ఇద్దరు డబ్బింగ్ చెపుతున్నారు. చిన్నప్పటి ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెపితే ఆతరువాత పెద్దది అయిన ఎల్సా పాత్రకు నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పింది. నవంబర్ 22న విడుదల కాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో సితార గొంతు వినడం కోసం మహేష్ అభిమానులు ఈ సినిమాను తప్పకుండా చూసే ఆస్కారం ఉంది..