సితార‌ ఎవ‌రిపోలికో తెలుసా..?

Mahesh Babu says My Daughter Sithara looks like My Mother

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హేష్ బాబు కూతురు సితార చాలా అందంగా ఉంటుంది. అయితే ఆమెలో తండ్రి పోలిక‌లు కానీ, త‌ల్లి న‌మ్ర‌తా శిరోద్కర్ పోలిక‌లు కానీ అంత‌గా క‌నిపించ‌వు. ఆమె ఎవ‌రిపోలిక అన్న‌దానిపై ఇన్ స్టాగ్రామ్ లో స‌మాధానం ఇచ్చారు మ‌హేశ్. త‌న గారాల‌ప‌ట్టి సితార‌… అచ్చం త‌న తల్లి ఇందిరాదేవిలాగే ఉంటుంద‌ని ఆయ‌న ఆనందం వ్య‌క్తంచేశారు. సితార ఫొటోను పోస్ట్ చేసిన మ‌హేశ్ పింక్… గ‌ర్ల్ ప‌వ‌ర్… చూడ‌టానికి అచ్చం మా అమ్మ‌లాగే ఉంది అని కామెంట్ పెట్టారు. దీంతో పాటు హార్ట్ సింబ‌ల్స్ కూడా జ‌త‌చేశారు.

మ‌హేశ్ పోస్ట్ చేసిన ఫొటోకు అభిమానుల నుంచి చాలా లైక్స్ వ‌చ్చాయి. ఫొటో పెట్టిన 15గంట‌ల్లోనే 1.08ల‌క్ష‌ల మంది లైక్ చేశారు. నిజంగానే సితార మ‌హేశ్ అమ్మ‌గారిలాగే ఉందంటూ కామెంట్లు పోస్ట్ చేశారు. మ‌హేశ్ ప్ర‌స్తుతం భ‌ర‌త్ అను నేను షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీమంతుడు త‌ర్వాత కొర‌టాల శివ‌, మ‌హేశ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఏప్రిల్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది.